కేసీఆర్‌ కుమారుడికి వారసత్వ పదవి ఎందుకు?: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

వీఆర్‌ఏలకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి చేతులు రాని ముఖ్యమంత్రి కేసీఆర్‌.. తన కుమారుడిని వారసత్వంగా గద్దెనెక్కించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర

Published : 07 Aug 2022 05:13 IST

చౌటుప్పల్‌, న్యూస్‌టుడే: వీఆర్‌ఏలకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి చేతులు రాని ముఖ్యమంత్రి కేసీఆర్‌.. తన కుమారుడిని వారసత్వంగా గద్దెనెక్కించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్కుమార్‌ ప్రశ్నించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో వీఆర్‌ఏల నిరవధిక సమ్మె శిబిరాన్ని శనివారం ఆయన సందర్శించారు. వారికి మద్దతు ప్రకటించి మాట్లాడారు. రూ. లక్షా పదిహేనువేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్లు ముడుపులు పుచ్చుకుని.. దాన్ని గంగలో ముంచితే అవినీతి కనిపించడం లేదా? అని అడిగారు. పేదరికం నుంచి వచ్చిన వీఆర్వోలు, తహసీల్దార్లలోనే అవినీతి కనిపిస్తుందా? అని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని