Revanth: మోదీకి లొంగిపోతారా..? ప్రశ్నిస్తారా..?

నీతిఆయోగ్‌ సమావేశానికి హాజరై రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని, రాష్ట్రానికి చట్టబద్ధంగా రావాల్సిన వాటిని సాధించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సూచించారు. లేనిపక్షంలో

Updated : 07 Aug 2022 06:00 IST

కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి ప్రశ్న

ఈనాడు, దిల్లీ: నీతిఆయోగ్‌ సమావేశానికి హాజరై రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని, రాష్ట్రానికి చట్టబద్ధంగా రావాల్సిన వాటిని సాధించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సూచించారు. లేనిపక్షంలో ప్రధాని మోదీకి ఆయన లొంగిపోయినట్లు ప్రజలు భావిస్తారన్నారు. దిల్లీ తెలంగాణ భవన్‌లో శనివారం రేవంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలో దాదాపు రూ.2 వేల కోట్ల నష్టం వాటిల్లిందని, సమావేశానికి హాజరైతే ప్రధానమంత్రికి వివరించే అవకాశం ఉండేదన్నారు. ఇటువంటి సమయంలో గైర్హాజరవడం క్షమించరాని నేరమన్నారు. ఈ నిర్ణయం ద్వారా మోదీతో ఉన్న చీకటి సంబంధాన్ని కేసీఆర్‌ నిరూపించుకున్నారని రేవంత్‌ ఆరోపించారు. ప్రతిపక్షాలను పట్టించుకోవడంలేదని ప్రధానిని నిందిస్తున్న కేసీఆర్‌ మొదట తాను పాటించి ఇతరులకు చెబితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. దాసోజు శ్రవణ్‌ కాంగ్రెస్‌ను వీడటంపై రేవంత్‌ స్పందిస్తూ.. వారు చేరుదామనుకున్న పార్టీలో కండువా కప్పిన రోజే పండుగ అని అన్నారు. తర్వాత ఎలా ఉంటుందో మీరే చూస్తారన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై అద్దంకి దయాకర్‌ వ్యాఖ్యలు వంద శాతం తప్పేనని రేవంత్‌ అన్నారు. ఈ విషయంలో పార్టీ తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. తెదేపాతో పొత్తులోనే 2018 ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డి ఎన్నికల్లో గెలిచారని, చంద్రబాబు నల్గొండ జిల్లాలోనూ ప్రచారం చేశారని గుర్తు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని