తెరాస నుంచి మురళీయాదవ్‌ సస్పెన్షన్‌

నర్సాపూర్‌ పురపాలక సంఘం అధ్యక్షుడు మురళీయాదవ్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు పద్మా దేవేందర్‌రెడ్డి ప్రకటించారు. శనివారం మెదక్‌లో ఆమె మాట్లాడారు. మురళీయాదవ్‌కు

Published : 07 Aug 2022 05:13 IST

మెదక్‌, న్యూస్‌టుడే: నర్సాపూర్‌ పురపాలక సంఘం అధ్యక్షుడు మురళీయాదవ్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు పద్మా దేవేందర్‌రెడ్డి ప్రకటించారు. శనివారం మెదక్‌లో ఆమె మాట్లాడారు. మురళీయాదవ్‌కు పార్టీలో సముచిత స్థానం కల్పించామని పేర్కొన్నారు. ఆయనకు గతంలో ఉమ్మడి మెదక్‌ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు, ప్రస్తుతం మున్సిపల్‌ ఛైర్మన్‌, ఆయన భార్య రాజమణికి ఉమ్మడి జడ్పీ ఛైర్‌పర్సన్‌ పదవిని పార్టీ కట్టబెట్టిందని వివరించారు. ఏదైనా సమస్య ఉంటే పార్టీలో అంతర్గతంగా చర్చించాలని, తమ దృష్టికి తీసుకురావాల్సిందని చెప్పారు. కానీ, పార్టీకి వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు ఆయనను సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని