విజయసాయిరెడ్డి మూడేళ్లు నిద్రపోయారా?

మూడు రాజధానుల ఏర్పాటు అధికారం రాష్ట్రానికి లేదని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పటికి గుర్తించారా? మూడేళ్లు నిద్రపోయారా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు.

Published : 07 Aug 2022 05:13 IST

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

ఈనాడు, అమరావతి: మూడు రాజధానుల ఏర్పాటు అధికారం రాష్ట్రానికి లేదని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పటికి గుర్తించారా? మూడేళ్లు నిద్రపోయారా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ‘‘ఒక రాష్ట్ర పరిధిలో రాజధానుల ఏర్పాటుపై అక్కడి శాసనసభకు విస్పష్టమైన అధికారం ఉండేలా రాజ్యాంగ సవరణ చేయాలని కోరుతూ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రైవేటు మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టడం ఏంటి? ఆయనకు ఇప్పుడు చట్టం గుర్తుకు వచ్చిందా? మూడు రాజధానుల నిర్ణయాన్ని అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. దీనిపై మూడేళ్లుగా పెద్ద ఉద్యమమే కొనసాగుతోంది. చివరికి హైకోర్టు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఇప్పటికీ బుద్ధి తెచ్చుకోకుండా పార్లమెంటులో ప్రైవేటు మెంబర్‌ బిల్లు ప్రవేశపెడుతున్నారంటే మూర్ఖత్వానికి పరాకాష్ఠ’’ అని రామకృష్ణ మండిపడ్డారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని