మాధవ్‌ను అనర్హుడిగా ప్రకటించాలి

వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియో వ్యవహారంలో లోక్‌సభ స్పీకర్‌ కలగజేసుకొని ఆయన్ను ఎంపీ పదవికి అనర్హుడిగా ప్రకటించాలని తెదేపా ప్రధాన కార్యదర్శి

Published : 07 Aug 2022 05:13 IST

తెదేపా ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ

ఈనాడు డిజిటల్‌, అమరావతి : వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియో వ్యవహారంలో లోక్‌సభ స్పీకర్‌ కలగజేసుకొని ఆయన్ను ఎంపీ పదవికి అనర్హుడిగా ప్రకటించాలని తెదేపా ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ డిమాండ్‌ చేశారు. నేరచరిత్ర ఉన్న వారిని ఎమ్మెల్యే, ఎంపీలుగా ఎంపిక చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. ‘‘వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నా.. జగన్‌ ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకొని పార్లమెంట్‌ ఘనతను, మహిళల గౌరవాన్ని కాపాడాలి’’ అని అనురాధ పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని