Andhra news: జగన్‌ మౌనానికి కారణమేంటి?

వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియో వ్యవహారంలో దేశమంతా ఆయన్ను అసహ్యించుకుంటుంటే సీఎం జగన్‌ మాత్రం ఎందుకు మౌనంగా ఉన్నారని తెదేపా రాష్ట్ర

Updated : 07 Aug 2022 06:19 IST

తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్‌రఫీ

ఈనాడు డిజిటల్‌, అమరావతి : వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియో వ్యవహారంలో దేశమంతా ఆయన్ను అసహ్యించుకుంటుంటే సీఎం జగన్‌ మాత్రం ఎందుకు మౌనంగా ఉన్నారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్‌రఫీ ప్రశ్నించారు. గతంలో ఇలాంటి ఆరోపణలే వచ్చిన నటుడు పృధ్వీరాజ్‌ను ఎస్వీబీసీ నుంచి అరగంటలో తీసేసిన విషయాన్ని గుర్తు చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.‘‘ గోరంట్ల మాధవ్‌ను కాపాండేందుకు జగన్‌, సజ్జల రామకృష్ణారెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. ఉప ఎన్నికలు వస్తే ఓడిపోతామనే భయంతోనే రాజీనామా చేయించడం లేదు. మహిళలకు హాని జరిగితే జగన్‌రెడ్డి ముందు వస్తారన్న రోజా ఏ కలుగులో దాక్కొన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తూతూ మంత్రపు లేఖతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు.’’ అని సయ్యద్‌రఫీ పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని