12 సంక్షేమ పథకాలను రద్దు చేసిన ప్రభుత్వం

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12 గిరిజన సంక్షేమ పథకాలను రద్దు చేసిందని తెదేపా ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు దొన్నుదొర, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌

Published : 07 Aug 2022 05:13 IST

తెదేపా నాయకులు దొన్నుదొర, ధారునాయక్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి : వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12 గిరిజన సంక్షేమ పథకాలను రద్దు చేసిందని తెదేపా ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు దొన్నుదొర, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ ధారునాయక్‌ మండిపడ్డారు. రాష్ట్రంలో గిరిజన హక్కులను జగన్‌ ప్రభుత్వం కాలరాస్తోందని శనివారం ఓ ప్రకటనలో ఆరోపించారు. తెదేపా హయాంలో నిర్మించిన 81 గురుకులాలకు నాడు-నేడు పేరుతో రంగులేయడం తప్ప జగన్‌ చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఈ నెల 9న తెదేపా కేంద్ర కార్యాలయంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించనున్నామని,  తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పాల్గొంటారని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని