కాంగ్రెస్‌లో సామాజిక న్యాయ బృందం రగడ

రాష్ట్ర కాంగ్రెస్‌లో సామాజిక న్యాయ బృందం (సోషల్‌ జస్టిస్‌ టీమ్‌) వివాదమైంది. పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు డా.మల్లు రవి నేతృత్వంలో ఆదివారం హైదరాబాద్‌లోని ఆయన

Published : 08 Aug 2022 04:53 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర కాంగ్రెస్‌లో సామాజిక న్యాయ బృందం (సోషల్‌ జస్టిస్‌ టీమ్‌) వివాదమైంది. పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు డా.మల్లు రవి నేతృత్వంలో ఆదివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఈ బృందం సమావేశమైంది. మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీకి పని చేయడానికి కార్యాచరణపై చర్చించడంతో పాటు మునుగోడులోని మండలాలకు సమన్వయకర్తలను నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఇది పార్టీలో చర్చకు దారితీసింది. సోషల్‌ జస్టిస్‌ టీమ్‌ను పార్టీలో ఎప్పుడు ఏర్పాటు చేశారనే ప్రశ్న తలెత్తింది. కొందరు నాయకులు ఒక దగ్గర కూర్చొని ఏదో పేరు పెట్టుకుని దాన్ని పార్టీకి ఆపాదించడంపై సీనియర్‌ నాయకులు కొందరు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. చివరికి పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ ఆదివారం రాత్రి దీనిపై పత్రికా ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్‌ సామాజిక న్యాయ బృందానికి.. పీసీసీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని