‘పాలమూరు’ పేరిట రూ. కోట్ల విలువైన నల్లమట్టి దోపిడీ: ప్రవీణ్‌

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరుతో తెరాస ఎమ్మెల్యేలు నల్లమట్టి దోపిడీకి పాల్పడుతున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. ఆయన

Published : 08 Aug 2022 04:53 IST

బిజినేపల్లి, న్యూస్‌టుడే: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరుతో తెరాస ఎమ్మెల్యేలు నల్లమట్టి దోపిడీకి పాల్పడుతున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. ఆయన ఆదివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం మంగనూరు, వెల్గొండలో పర్యటించారు. తిమ్మాజిపేట మండలం చేగుంట సమీపంలో పాలమూరు జలాశయ పనుల కోసం నిల్వ చేసిన భారీ నల్లమట్టి డంపులను పరిశీలించి మాట్లాడారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఎలాంటి అనుమతులు లేకుండా శిఖం, ఎసైన్డ్‌, చెరువుల భూముల్లోని నల్లమట్టిని తెరాస నాయకులు, కార్యకర్తలు రూ.వెయ్యి కోట్లకు పనులు పొందిన కంపెనీకి అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని దుయ్యబట్టారు. అక్రమాలను ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని పేర్కొన్నారు. బీఎస్పీ అధికారంలోకి వచ్చాక సమగ్ర విచారణ చేయిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని