20 శాతం మందికే ‘నేతన్న నేస్తం’

రాష్ట్రంలో అర్హులైన వారిలో కేవలం 20 శాతం మందికే ‘నేతన్న నేస్తం’ పథకం కింద లబ్ధి చేకూరుతోందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. వివిధ రాష్ట్రాల్లో

Published : 08 Aug 2022 05:17 IST

తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో అర్హులైన వారిలో కేవలం 20 శాతం మందికే ‘నేతన్న నేస్తం’ పథకం కింద లబ్ధి చేకూరుతోందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. వివిధ రాష్ట్రాల్లో నేతన్నలకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తుంటే ఏపీలో వైకాపా సర్కారు మాత్రం ఉన్న పథకాలను తగ్గించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఆదివారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. ‘తెదేపా హయాంలో చేనేతల సంక్షేమానికి అమలైన అనేక కార్యక్రమాలను జగన్‌ ప్రభుత్వం రద్దు చేసింది’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని