మునుగోడు నుంచే ధర్మయుద్ధం ప్రారంభం

సీఎం కేసీఆర్‌, రాష్ట్ర ప్రభుత్వంపై మునుగోడు నుంచే ధర్మయుద్ధం ప్రారంభిస్తామని, ఇక్కడ జరిగే ఉప ఎన్నిక రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నిర్దేశిస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. అసెంబ్లీలో భాజపాకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌

Published : 09 Aug 2022 04:44 IST

‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు మరో ‘ఆర్‌’ జతచేయబోతున్నాం

ప్రజాసంగ్రామ యాత్రలో బండి సంజయ్‌

ఈనాడు, నల్గొండ-న్యూస్‌టుడే, చౌటుప్పల్‌: సీఎం కేసీఆర్‌, రాష్ట్ర ప్రభుత్వంపై మునుగోడు నుంచే ధర్మయుద్ధం ప్రారంభిస్తామని, ఇక్కడ జరిగే ఉప ఎన్నిక రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నిర్దేశిస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. అసెంబ్లీలో భాజపాకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌ ’ (రాజాసింగ్‌, రఘునందన్‌, రాజేందర్‌)కు తోడుగా మరో ఆర్‌ (రాజగోపాల్‌రెడ్డి)ని జతచేస్తామని వెల్లడించారు. మరో ఏడాది కాలంలో రాష్ట్రంలో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి గొల్కొండ ఖిల్లాపై కాషాయజెండా ఎగురేస్తామని ధీమా వ్యక్తంచేశారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా సోమవారం ఆరోరోజు సంజయ్‌ పాదయాత్ర మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో పట్టణంలో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు. ఎనిమిదేళ్ల కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలూ మోసపోయాయని, మునుగోడు ఉప ఎన్నికల్లో తెరాసను తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఫార్మా కంపెనీలతో ఇక్కడి ప్రాంతం కలుషితమైందని, దానికి కారకులైన వారి నుంచి సీఎం సూట్‌కేసులు తీసుకొని రాజ్యసభ సీటిచ్చారని ఆరోపించారు. అంతకుముందు పాదయాత్ర చౌటుప్పల్‌ మండలం మసీదుగూడెంలో ప్రారంభమై శేరిల్లా, పెద్దకొండూరు, చిన్నకొండూరు, గ్రామాల మీదుగా చౌటుప్పల్‌కు చేరుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని