ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిపై ఎస్సీ, ఎస్టీ కేసు

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే, తెదేపా శాసన సభాపక్ష ఉప నాయకుడు నిమ్మల రామానాయుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ నెల 5న పాలకొల్లు శివారు పెంకుళ్లపాడులో టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమం జరిగింది.

Published : 09 Aug 2022 04:44 IST

పాలకొల్లు పట్టణం, న్యూస్‌టుడే: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే, తెదేపా శాసన సభాపక్ష ఉప నాయకుడు నిమ్మల రామానాయుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ నెల 5న పాలకొల్లు శివారు పెంకుళ్లపాడులో టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సమయంలో తనను కులం పేరుతో దూషించి బెదిరించారని వైకాపా నాయకుడు బండి రమేష్‌ ఆదివారం రాత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పట్టణ సీఐ ఎస్‌.అఖిల్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని