ప్రతి నిరుపేద కుటుంబానికి ఎకరా భూమి: ప్రవీణ్‌కుమార్‌

కేసీఆర్‌ దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పిన మాట నిలబెట్టుకోలేదని, బీఎస్పీ అధికారంలోకి వస్తే ప్రతి నిరుపేద కుటుంబానికి ఎకరా భూమి ఇస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.

Published : 09 Aug 2022 04:54 IST

శాంతినగర్‌ న్యూస్‌టుడే : కేసీఆర్‌ దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పిన మాట నిలబెట్టుకోలేదని, బీఎస్పీ అధికారంలోకి వస్తే ప్రతి నిరుపేద కుటుంబానికి ఎకరా భూమి ఇస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్‌లో సోమవారం నిర్వహించిన బహుజన మహిళా గర్జన సభలో మాట్లాడారు. బీఎస్పీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎసైన్డ్‌, పోడు భూములు ఎకరా నుంచి 5 ఎకరాల వరకు మహిళల పేరిట పట్టాలు అందిస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో బహుజన ఫిల్మ్‌ సిటీని ఏర్పాటు చేసి ఇప్పటి సినీ నటుల్ని తలదన్నేలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు శిక్షణ ఇస్తామన్నారు.  అంతకుముందు వడ్డేపల్లి తహసీల్దారు కార్యాలయం ముందు నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్‌ఏలను కలిసి మద్దతు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని