తెరాస ప్రభుత్వ అవినీతిపై ఈడీ విచారణకు అవకాశం

రాష్ట్రంలోని తెరాస ప్రభుత్వ అవినీతిపై ఈడీ విచారణ జరిగే అవకాశముందని భాజపా మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జి పి.మురళీధర్‌రావు తెలిపారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమ ఆదాయం విషయాల్లో బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు

Published : 09 Aug 2022 04:54 IST

అధికార పార్టీలో త్వరలో భూకంపం: భాజపా

గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని తెరాస ప్రభుత్వ అవినీతిపై ఈడీ విచారణ జరిగే అవకాశముందని భాజపా మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జి పి.మురళీధర్‌రావు తెలిపారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమ ఆదాయం విషయాల్లో బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకునేందుకు అడుగులు ముందుకు వేయనుందని వెల్లడించారు. రానున్న ఆరు నెలల్లో అనేక విషయాలు బయటకు రానున్నాయన్నారు. తెరాసలో విపరీతమైన అసమ్మతి ఉందని, ఆ పార్టీలో త్వరలో భూకంపం రానుందని జోస్యం చెప్పారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ నీతి ఆయోగ్‌పై రాజకీయ విమర్శలకు దిగుతున్నారన్నారు. నీతి ఆయోగ్‌ను బహిష్కరించడం, కేంద్ర ప్రభుత్వం, భాజపాకు వ్యతిరేకంగా రాజకీయ యుద్ధం చేసినంత మాత్రాన ఇవి ఆగబోవని స్పష్టం చేశారు. సోమవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ ఎస్‌.ప్రకాశ్‌రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధి ఆధారంగా గెలవలేమని తేలిపోవడంతో కేసీఆర్‌ దుష్ప్రచారానికి దిగుతున్నారని ధ్వజమెత్తారు. ఈడీ, ఐటీ దాడుల విషయాల్లో భాజపా ఎలాంటి జోక్యం చేసుకోదన్నారు. సిద్దిపేటలో ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, అక్కడా ఓడిపోవడం ఖాయమని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలపై సిద్దిపేటలో బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని