మునుగోడు ఎన్నికకు బదులు తెరాస ముందస్తుకు వెళ్లొచ్చు: ఇంద్రసేనారెడ్డి

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆమోదించుకున్నప్పటికీ తెరాసలో కదలిక లేదని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, జాతీయ కార్యవర్గసభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. అధికారపక్షం తీరు చూస్తుంటే మునుగోడుకు

Published : 10 Aug 2022 07:08 IST

ఈనాడు, హైదరాబాద్‌: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆమోదించుకున్నప్పటికీ తెరాసలో కదలిక లేదని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, జాతీయ కార్యవర్గసభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. అధికారపక్షం తీరు చూస్తుంటే మునుగోడుకు ఉపఎన్నిక రాకపోవచ్చని, సీఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఛాన్సూ ఉందని ఆయన మంగళవారమిక్కడ విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ అన్నారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో నేను పోటీచేసిప్పుడు మునుగోడు సెగ్మెంట్లో భాజపాకు 30 వేల ఓట్లు వచ్చాయి. పదేళ్లుగా రాజగోపాల్‌రెడ్డికి అక్కడ గట్టి పట్టుంది. 2018 ఎన్నికల్లో రాష్ట్రంలో ఏకంగా 88 స్థానాల్లో గెలిచిన తెరాస మునుగోడులో ఓడిపోవడానికి కారణం ఆయన ప్రత్యర్థిగా ఉండటమే. అప్పుడే గెలవని తెరాస ఇప్పుడెలా గెలుస్తుంది. విజయం సాధించబోయేది రాజగోపాల్‌రెడ్డినే. రాహుల్‌గాంధీ వచ్చి ప్రచారం చేసినా కాంగ్రెస్‌కు ఓటమి తప్పదు. తెదేపాతో పొత్తుండదు. భాజపా ఒంటరిగానే పోటీచేస్తుంది’ అని ఇంద్రసేనారెడ్డి స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని