ఎస్టీ రిజర్వేషన్ల పెంపునకు జోక్యం చేసుకోండి

తెలంగాణలో గిరిజనుల రిజర్వేషన్లను ఆరు శాతం నుంచి పది శాతానికి పెంచే విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు గిరిజన సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతిని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌, నల్గొండ ఎంపీ

Published : 10 Aug 2022 05:22 IST

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు గిరిజన నాయకుల విజ్ఞప్తి

ఈనాడు, దిల్లీ: తెలంగాణలో గిరిజనుల రిజర్వేషన్లను ఆరు శాతం నుంచి పది శాతానికి పెంచే విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు గిరిజన సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతిని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర గిరిజన నాయకులు మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా గిరిజనుల ఇబ్బందులు, రిజర్వేషన్లలో లోటుపాట్లను రాష్ట్రపతికి వారు వివరించారు. అనంతరం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో రాములు నాయక్‌ నేతృత్వంలో ఆలిండియా బంజారా సంస్థల ఆధ్వర్యంలో గిరిజన సమస్యలపై జాతీయ సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హాజరై ప్రసంగించారు. తెరాస ప్రభుత్వం పోడు భూముల విషయంలో ఆటవికంగా ప్రవర్తిస్తూ గిరిజనులను వారి భూముల నుంచి ఖాళీ చేయిస్తోందని ఆరోపించారు. పోడు సమస్య పరిష్కారంపై దృష్టి సారించాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసినట్లు ఆయన చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని