గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమాలు చేపట్టాలి: రేవంత్‌రెడ్డి

ఆదివాసీలు, గిరిజనుల బతుకుల్లో వెలుగులు నింపే కార్యక్రమాలు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. స్వాతంత్య్ర అమృత మహోత్సవాలు నిర్వహిస్తున్న ప్రస్తుత తరుణంలోనూ వారి జీవితాల్లో

Published : 10 Aug 2022 05:22 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ఆదివాసీలు, గిరిజనుల బతుకుల్లో వెలుగులు నింపే కార్యక్రమాలు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. స్వాతంత్య్ర అమృత మహోత్సవాలు నిర్వహిస్తున్న ప్రస్తుత తరుణంలోనూ వారి జీవితాల్లో మార్పు రాకపోవడం దురదృష్టకరమన్నారు. మంగళవారం(ఆగస్టు 9) ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ బిడ్డలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనొక ప్రకటన విడుదల చేశారు. మోదీ, కేసీఆర్‌ పాలనలో ఆదివాసీల బతుకులు దుర్భరంగా మారాయన్నారు. 2018 ఎన్నికల సమయంలో పోడు భూముల సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్‌.. ఆ దిశగా చర్యలు తీసుకోకపోగా హరితహారం, ప్రాజెక్టుల పేరుతో వారి నుంచి భూములను బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. ఆదివాసీ, గిరిజనుల బతుకులు మారాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాల్సిందేనని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక గిరిజనులకు పోడు భూములపై హక్కులు కల్పించడంతో పాటు ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేల ఆర్థికసాయం అందజేస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని