Published : 10 Aug 2022 05:22 IST

వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌ కోసం పనిచేస్తారు

 సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

కూసుమంచి, గాంధీభవన్‌, న్యూస్‌టుడే: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్టార్‌ క్యాంపెయినర్‌గా మునుగోడులో తమ పార్టీ అభ్యర్థి విజయం కోసం పని చేస్తారని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష(సీఎల్పీ) నాయకుడు భట్టి విక్రమార్క తెలిపారు. ఏఐసీసీ పిలుపు మేరకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ కమిటీ మంగళవారం చేపట్టిన ఆజాదీ కా గౌరవ్‌ పాదయాత్రకు భట్టి హాజరయ్యారు. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి పురాతన శివాలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర సత్తుపల్లి నియోజకవర్గంలోని పెనుబల్లి వరకు 75 కిలోమీటర్లు సాగనుంది. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. మునుగోడు శాసనసభ నియోజకవర్గానికి ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌దే విజయమన్నారు. అనేకసార్లు మునుగోడులో కాంగ్రెస్‌ గెలిచిందని, మళ్లీ గెలవబోతోందని చెప్పారు. ఆ నియోజకవర్గంలో తమకు తెరాసతోనే పోటీ తప్ప భాజపాతో కాదన్నారు. 

క్విట్‌ ఇండియా దినోత్సవం సందర్భంగా మంగళవారం గాంధీభవన్‌లో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ పార్టీ జెండాను ఎగురవేశారు. అదే విధంగా యువజన కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ విభాగం జెండానూ ఆవిష్కరించారు. దేశాన్ని, రాష్ట్రాన్ని వారి నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందంటూ సోనియాగాంధీ, రేవంత్‌రెడ్డిల నాయకత్వంలో కాంగ్రెస్‌ చేస్తున్న పోరాటాలకు ప్రజలు కలిసి రావాలని మహేష్‌కుమార్‌ గౌడ్‌ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌, సీనియర్‌ ఉపాధ్యక్షులు టి.కుమార్‌రావు, నిరంజన్‌, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని