Published : 10 Aug 2022 05:47 IST

హడావుడిగా వర్షాకాల సమావేశాల ముగింపు

ఆసక్తి చూపని ప్రభుత్వం : కాంగ్రెస్‌

దిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు అత్యంత అసంతృప్తికరంగా ముగిశాయని కాంగ్రెస్‌ మంగళవారం విచారం వ్యక్తం చేసింది. సభలో చర్చలకు, బిల్లుల ఆమోదానికి చివరివరకు కూర్చోడానికి ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నా.. ప్రభుత్వం ఆసక్తి చూపలేదని విమర్శించింది. షెడ్యూలు కంటే ముందే సోమవారంతో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన విషయం తెలిసిందే. ‘రాష్ట్రపత్ని’ వివాదం, ఈడీ దాడులు, 27 మంది ఎంపీల సస్పెన్షన్‌, అధిక ధరల వంటి అంశాలపై ఆందోళనలతోనే సమావేశాలు కొనసాగాయి. ప్రధానికి, మంత్రులకు పార్లమెంటు అంటే ఉన్న నిర్లక్ష్యం కారణంగానే సమావేశాలను హడావుడిగా ముగించారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. సమావేశాల ప్రారంభంలో 32 బిల్లులను జాబితాలో చూపిన ప్రభుత్వం లోక్‌సభలో ఏడు, రాజ్యసభలో 5 బిల్లుల ఆమోదంతోనే సరిపెట్టిందన్నారు. ఓ అంశానికి సంబంధించి కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌధురి రాతపూర్వకంగా క్షమాపణ కోరినప్పటికీ.. సోనియా క్షమాపణ చెప్పాలంటూ అధికారపక్ష సభ్యులు సభను స్తంభింపజేయడం అసాధారణమన్నారు. 

* పార్లమెంటు సమావేశాలను షెడ్యూలు కంటే రెండు రోజులు ముందు మాత్రమే వాయిదా వేశామని, అదీ ప్రతిపక్షాలతోపాటు పలువురు ఎంపీలు కోరిన మీదటే ఆ నిర్ణయం తీసుకొన్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి వివరణ ఇచ్చారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని