భాజపా విధానాలపై పోరాటం చేయాలి: సీపీఐ

భాజపా ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా ఎన్డీయే కూటమి నుంచి ఒక్కొక్కరు బయటకు వస్తున్నారని, రాష్ట్రంలో జగన్‌, చంద్రబాబు మాత్రం మోదీతో సన్నిహితంగా మెలుగుతున్నారని

Published : 11 Aug 2022 04:48 IST

ఈనాడు, అమరావతి: భాజపా ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా ఎన్డీయే కూటమి నుంచి ఒక్కొక్కరు బయటకు వస్తున్నారని, రాష్ట్రంలో జగన్‌, చంద్రబాబు మాత్రం మోదీతో సన్నిహితంగా మెలుగుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. విజయవాడ దాసరి భవన్‌లో బుధవారం కామ్రేడ్‌ దాసరి నాగభూషణరావు 97వ జయంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భాజపా విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం అసన్నమైందని, దానికి పార్టీ 24వ జాతీయ మహాసభలు వేదిక కానున్నాయని పేర్కొన్నారు. దాసరి నాగభూషణరావు విద్యార్థి నాయకుడిగా మొదట్లో తన జీవితాన్ని ప్రారంభించినా ఆ తర్వాత పార్టీలో అన్ని స్థాయిలో పదువులు నిర్వర్తించారని, రాజ్యసభ సభ్యులుగా ప్రజా సమస్యల్ని చట్ట సభల్లో ప్రస్తావించారని వెల్లడించారు. ఆయన ఉద్యమ పటిమ నేటి తరం కమ్యూనిస్టులకు స్ఫూర్తిదాయకమని, దాసరి తుది శ్వాస వరకు పార్టీ కోసం శ్రమించారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని