మాధవ్‌ ఫోనెందుకు సీజ్‌ చేయడంలేదు?

వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ కేసులో వాస్తవాలను మరుగున పరిచేందుకు సీఎం జగన్‌ ప్రయాస పడుతున్నట్లు స్పష్టమవుతోందని మాజీమంత్రి పీతల సుజాత, తెదేపా రాష్ట్ర

Published : 11 Aug 2022 04:48 IST

నాడు రఘురామ ఫోన్‌ సీజ్‌ చేశారు కదా..

పీతల సుజాత, పంచుమర్తి అనూరాధ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ కేసులో వాస్తవాలను మరుగున పరిచేందుకు సీఎం జగన్‌ ప్రయాస పడుతున్నట్లు స్పష్టమవుతోందని మాజీమంత్రి పీతల సుజాత, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనూరాధ విమర్శించారు. కోట్లాది మంది మహిళల ఆత్మగౌరవం కన్నా సీఎంకు డర్టీ ఎంపీనే ఎక్కువయ్యారా అని మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మాధవ్‌ వీడియోపై విచారణ జరపాలని రాష్ట్ర డీజీపీకి ఈ నెల 6న మహిళా కమిషన్‌ లేఖ రాసినా ఆ వీడియోను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపకపోవడం కేసును తప్పుదారి పట్టించడం కాదా? అని పేర్కొన్నారు. ‘‘గతంలో ఎంపీ రఘురామకృష్ణరాజు ఫోన్‌ను సీజ్‌ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎంపీ మాధవ్‌ ఫోన్‌ను వారంరోజులైనా ఎందుకు సీజ్‌ చేయలేదు? ఎస్పీ ఫక్కీరప్ప ప్రెస్‌మీట్‌ ముగిసిన వెంటనే దిల్లీలో ఎంపీ ప్రెస్‌మీట్‌ పెట్టడం పోలీసు కుమ్మక్కుకు నిదర్శనం కాదా? గోరంట్ల మాధవ్‌ను రక్షించడానికి కుల చిచ్చు కుట్ర, ప్రతిపక్ష నేతలపై నీచమైన భాషా ప్రయోగం డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగం కాదా?’’ అని వారు ప్రశ్నించారు. మహిళలపై జరుగుతున్న నేరాల్లో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో ఉండడానికి జగన్‌రెడ్డి నేర చరిత్రే కారణమని ధ్వజమెత్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని