బీసీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలి: ఆర్‌.కృష్ణయ్య

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోని బీసీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండు చేశారు. పదోన్నతుల్లో రిజర్వేషన్లు, 16 లక్షల

Published : 11 Aug 2022 06:11 IST

ఈనాడు, దిల్లీ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోని బీసీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండు చేశారు. పదోన్నతుల్లో రిజర్వేషన్లు, 16 లక్షల ఉద్యోగాల భర్తీ చేపట్టాలంటూ సంఘం ఆధ్వర్యంలో దిల్లీలోని జంతర్‌మంతర్‌లో బుధవారం ప్రదర్శన, నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్ల కల్పనకు పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ బీసీ వ్యతిరేక వైఖరితో ఆ బిల్లు పెట్టలేదని ఆరోపించారు. కేంద్ర స్థాయిలో 54 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే అందులో బీసీ ఉద్యోగులు కేవలం 4.62 లక్షలు మాత్రమే ఉన్నారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని