జెండాలు పంపిణీ చేయలేని స్థితిలో కేంద్రం ఉందా..?: మంత్రి హరీశ్‌రావు

జాతీయ జెండాలు అందించలేకపోతున్నామని, ఇంటి ముందు కాగితాలు అతికించుకోవాలని భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించడం శోచనీయమని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. దేశంలో త్రివర్ణ పతాకాలను పంపిణీ

Published : 11 Aug 2022 06:11 IST

సిద్దిపేట, న్యూస్‌టుడే: జాతీయ జెండాలు అందించలేకపోతున్నామని, ఇంటి ముందు కాగితాలు అతికించుకోవాలని భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించడం శోచనీయమని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. దేశంలో త్రివర్ణ పతాకాలను పంపిణీ చేయలేని స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. సిద్దిపేటలోని రంగనాయకసాగర్‌ ప్రాజెక్టు చెంత ఏర్పాటు చేసిన ఫ్రీడం పార్కును బుధవారం మంత్రి ప్రారంభించారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు అవమానకరమని, దేశ ప్రజలకు జాతీయ జెండాలు సరఫరా చేయకపోవడం దురదృష్టకరమన్నారు. ‘రాష్ట్రంలోని చేనేత కార్మికులతో 1.20 కోట్ల జాతీయ జెండాలు తయారీ చేయించి ఇంటింటా పంపిణీ చేస్తున్నాం. విద్యార్థుల కోసం  థియేటర్లలో ‘గాంధీ’ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నాం. స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకుంటూ గ్రామాల్లో పెద్ద మొత్తంలో మొక్కలు నాటుతున్నాం’’ అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని