Prudhvi Raj: అక్కచెల్లెళ్లకూ, తల్లులకూ సెల్‌ చూడద్దొని చెప్పాం

రాష్ట్ర ప్రజలు, అక్కచెల్లెళ్లు, తల్లులు సెల్‌ ఫోన్‌ చూడొద్దని మొట్టమొదటిసారి విజ్ఞప్తి చేయాల్సి వచ్చిందని సినీ నటుడు పృధ్వీరాజ్‌ పేర్కొన్నారు. ‘వాంటెడ్‌ పండుగాడు’ చిత్ర యూనిట్‌

Updated : 12 Aug 2022 05:56 IST

ఎంపీ మాధవ్‌ వ్యవహారంపై సినీ నటుడు పృధ్వీరాజ్‌ స్పందన

ఈనాడు, విశాఖపట్నం: రాష్ట్ర ప్రజలు, అక్కచెల్లెళ్లు, తల్లులు సెల్‌ ఫోన్‌ చూడొద్దని మొట్టమొదటిసారి విజ్ఞప్తి చేయాల్సి వచ్చిందని సినీ నటుడు పృధ్వీరాజ్‌ పేర్కొన్నారు. ‘వాంటెడ్‌ పండుగాడు’ చిత్ర యూనిట్‌ గురువారం విశాఖలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొంది. ఎంపీ గోరంట్ల మాధవ్‌దిగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న వీడియో గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు పృథ్వీరాజ్‌ స్పందించారు. వరలక్ష్మీ వ్రతం ముందురోజే వచ్చిన ఆ దరిద్రాన్ని తాను చూశానని....అందుకే మిగిలిన వారిని చూడొద్దని చెప్పానని అన్నారు. దేశ చరిత్రలో ఇంత దౌర్భాగ్యం ఎప్పుడూ లేదన్నారు. పార్లమెంటు అంటే పవిత్ర దేవాలయమని భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన సమరయోధులు ఎందరో అందులో కొలువయ్యారని గుర్తుచేశారు. అలాంటి వాళ్లు ఉండాల్సిన చోట ఇలాంటి వాళ్లు ఉన్నారని విమర్శించారు. ‘గతంలో వారం రోజులపాటు నా మీద ప్రెస్‌మీట్లు పెట్టారు.... ఇప్పుడేవి?’ అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఒక్క ప్రెస్‌మీట్‌ లేదన్నారు. ‘అనంతపురం ఎస్పీ విలేకరుల సమావేశం పెడుతున్నట్లు ఆయనకు ఎలా తెలుసు? ఎస్పీ మాట్లాడుతున్నప్పుడే... మాధవ్‌ దిల్లీలో మాట్లాడారు. ఇంగ్లండ్‌ నుంచి అప్‌లోడ్‌ అయింది.... ఎవరో చేశారు... ఒరిజినల్‌ క్లిప్పింగ్‌ను కనిపెట్టలేకపోయాం... అంటూ ఎస్పీ మాటలు చాలా దీనంగా ఉన్నాయి. ఫోరెన్సిక్‌ నిపుణులు అరగంటలో వాస్తవం తేలుస్తారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంటూనే ఫేక్‌ అని తేల్చేశారు. వాళ్ల కోర్టులో అది ఫేక్‌దేనని తేలుతుంది. అంతకు మించి వేరే ఏమీ రాదు. ఆయన పృధ్వీ కాదు కదా... మాకు అంగబలం... అర్థబలం లేదు... ఉంటే అద్భుతం అంటారు’ అని పృధ్వీరాజ్‌ వివరించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని