Published : 12 Aug 2022 06:17 IST

ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శులకు పని విభజన

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జులకు లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పని విభజన చేస్తూ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం తెలంగాణకు ముగ్గురు ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శులు ఉండగా వారిలో బోసురాజుకు నల్గొండ, భువనగిరి, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, మెదక్‌, చేవెళ్లతో పాటు మహిళా కాంగ్రెస్‌, సేవాదళ్‌, కిసాన్‌ కాంగ్రెస్‌, రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్‌ సంఘటన్‌ల సమన్వయ బాధ్యతలు అప్పగించారు. నదీమ్‌ జావెద్‌కు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, జహీరాబాద్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ నియోజకవర్గాలతో పాటు యువజన కాంగ్రెస్‌, మైనార్టీ, ఓబీసీ, ఎస్సీ, ఆదివాసీ విభాగాల సమన్వయ బాధ్యతలు అప్పగించారు. మరో ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శి రోహిత్‌ చౌదరికి కరీంనగర్‌, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్‌, మహబూబాబాద్‌లతో పాటు ఎన్‌ఎస్‌యూఐ, జవహర్‌ బాల్‌మంచ్‌, సామాజిక మాధ్యమాలు, న్యాయ, మత్స్య విభాగాలకు సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని