Published : 12 Aug 2022 06:17 IST

క్షుద్రవిద్యలంటూ ప్రధాని స్థాయి తగ్గించొద్దు

మోదీపై రాహుల్‌ ఎదురుదాడి

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్షుద్రవిద్యలంటూ మూఢనమ్మకాల గురించి మాట్లాడి ఆ పదవికి ఉన్న ఔన్నత్యాన్ని తగ్గించడం మానుకోవాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ సూచించారు. అధిక ధరలకు నిరసనగా ఆగస్టు 5న కాంగ్రెస్‌ పార్టీ నేతలు నల్ల దుస్తులతో తెలిపిన నిరసనను.. ‘కాలా జాదూ’ (బ్లాక్‌ మ్యాజిక్‌) వంటి వాటిపై నమ్మకాలు పెట్టుకున్నవారు ప్రజల విశ్వాసం పొందలేరని మోదీ విమర్శించిన విషయం తెలిసిందే. దీనిపై రాహుల్‌ గురువారం ఎదురుదాడికి దిగారు. ‘ప్రైం మినిస్టర్‌ జీ! దేశంలో ఉన్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం మీకు కనబడకపోవచ్చు.. లేని విషయాలు మాట్లాడి దేశాన్ని తప్పుదోవ పట్టించడం ఆపండి. ప్రజాసమస్యలపై మీరు సమాధానం చెప్పక తప్పదు’ అంటూ హిందీలో ట్వీట్‌ చేశారు.

నల్లచొక్కాతోనే పెరియార్‌ ప్రజావిశ్వాసం పొందలేదా!

తమిళనాడుకు చెందిన రాజకీయవేత్త ఇ.వి.ఆర్‌.పెరియార్‌ తన జీవితకాలమంతా నల్లచొక్కాతోనే తిరిగారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం ప్రధానికి గుర్తు చేశారు. సనాతన ధర్మాన్ని నమ్మేవారు మినహా తమిళ ప్రజలంతా ఆయనకు బ్రహ్మరథం పట్టారని ట్వీట్‌ చేశారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని