రాష్ట్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలతో అంతర్యుద్ధం

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక చర్యలతో ప్రజలకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం పోయి అంతర్యుద్ధం వచ్చే ప్రమాదం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వైకాపా ఎంపీ

Published : 13 Aug 2022 02:40 IST

రాష్ట్రపతికి లేఖ అందజేసిన వైకాపా ఎంపీ రఘురామ

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక చర్యలతో ప్రజలకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం పోయి అంతర్యుద్ధం వచ్చే ప్రమాదం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. రాష్ట్రపతి ముర్మును తన సతీమణి రమాదేవితో కలిసి ఎంపీ శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా తన అరెస్టు, కస్టడీలో చిత్రహింసలు పెట్టిన తీరు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు, నిధుల మళ్లింపు అంశాలను ఆయన వివరించారు. ఈ మేరకు అయిదు పేజీల లేఖను రాష్ట్రపతికి అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని