మునుగోడు ఉప ఎన్నికతోనే కేసీఆర్‌ ప్రభుత్వ పతనం ప్రారంభం

రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వానికి మునుగోడు ఉప ఎన్నికతోనే పతనం ప్రారంభమైందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మునుగోడులో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

Published : 13 Aug 2022 04:59 IST

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

మునుగోడు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వానికి మునుగోడు ఉప ఎన్నికతోనే పతనం ప్రారంభమైందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మునుగోడులో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గ సమస్యలపై చర్చించేందుకు వెళ్తే ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని తెలిపారు. ప్రగతిభవన్‌, ఫాంహౌస్‌లకు పరిమితమైన సీఎం తన రాజీనామాతో ప్రజల వద్దకు దిగి వస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం 10 లక్షల మందికి కొత్త పింఛన్లు, ఉపాధి హామీ క్షేత్ర సహాయకులను విధుల్లోకి తీసుకోవడం, చేనేత కార్మికులకు బీమా సౌకర్యం తదితర చర్యలు చేపట్టిందన్నారు.మూడున్నర ఏళ్లుగా ఏమీ అభివృద్ధి చేయలేకపోయానని తెలిపారు. ఎన్నికలు వచ్చినచోటే ఈ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని, అందుకే రాజీనామా చేశానని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని