మునుగోడులో పోటీపై త్వరలో నిర్ణయం: సీపీఐ

మునుగోడు ఉప ఎన్నికలో సీపీఐ పోటీపై సమీక్షిస్తున్నామని, త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి చెప్పారు. నియోజకవర్గంలో

Published : 13 Aug 2022 04:59 IST

నల్గొండ గ్రామీణం, న్యూస్‌టుడే: మునుగోడు ఉప ఎన్నికలో సీపీఐ పోటీపై సమీక్షిస్తున్నామని, త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి చెప్పారు. నియోజకవర్గంలో కమ్యూనిస్టులకు బలమైన ఓటు బ్యాంకు ఉందన్నారు. శుక్రవారం నల్గొండలో నిర్వహించిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల పొత్తులో భాగంగా 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సీపీఐ మద్దతు ఇచ్చి రాజగోపాల్‌రెడ్డిని గెలిపించిందన్నారు. ఇప్పుడు స్వార్థ ప్రయోజనాల కోసం ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి భాజపాలో చేరుతున్నారని తెలిపారు. ఆ పార్టీని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తిలో నిర్లక్ష్యంపై అధికార పార్టీని నిలదీస్తామని చెప్పారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని