దేశ సంపదను మోదీ నాశనం చేస్తున్నారు: భట్టి

ప్రధాని నరేంద్ర మోదీ నియంతలా పాలిస్తూ దేశ సంపదను నాశనం చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను దేశానికి తలమానికంలా మార్చిందని, వాటిని కార్పొరేట్‌ వర్గాలకు

Published : 13 Aug 2022 04:59 IST

వైరా, న్యూస్‌టుడే: ప్రధాని నరేంద్ర మోదీ నియంతలా పాలిస్తూ దేశ సంపదను నాశనం చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను దేశానికి తలమానికంలా మార్చిందని, వాటిని కార్పొరేట్‌ వర్గాలకు ధారాదత్తం చేయడానికి మోదీ కుట్ర పన్నారని ఆరోపించారు. ఆయన చేపట్టిన ఆజాదీకా అమృత్‌ గౌరవ యాత్ర శుక్రవారం ఖమ్మం జిల్లా వైరా పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా క్రాస్‌రోడ్‌లో జరిగిన సభలో భట్టి మాట్లాడుతూ, స్వాతంత్య్ర సంగ్రామంలో భాగంగా నెహ్రూ పదేళ్లపాటు జైల్లోనే మగ్గారని, మోదీ ఏం త్యాగాలు చేసి ప్రధాని అయ్యారో చెప్పాలని ప్రశ్నించారు. ఆయన బ్రిటిష్‌ రాచరిక, నియంత పాలనను గుర్తుకుతెస్తున్నారని ఆక్షేపించారు. దేశంలో భాజపా, రాష్ట్రంలో తెరాస పాలన కొనసాగితే అంధకారం, అధోగతి తప్ప ఇంకేమీ మిగలదన్నారు.


పెరిగిన ధరలకు వ్యతిరేకంగా 17 నుంచి నిరసనలు: మహేశ్వర్‌రెడ్డి

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఈ నెల 17 నుంచి 23వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ తెలంగాణ ఛైర్మన్‌ ఎ.మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఏఐసీసీ ఆధ్వర్యంలో ఆగస్టు 28న దిల్లీలోని రాంలీలా మైదానంలో నిరసన ర్యాలీ నిర్వహిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని