గోరంట్ల మాధవ్‌ చేసిన తప్పుడు పనిని ముఖ్యమంత్రి సమర్థిస్తున్నారు

వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ చేసిన తప్పుడు పనిని సీఎం జగన్‌రెడ్డి సమర్థిస్తున్నారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్‌మీరా ధ్వజమెత్తారు.  శుక్రవారం ఆయన

Published : 13 Aug 2022 05:11 IST

తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్‌మీరా

ఈనాడు డిజిటల్‌, అమరావతి : వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ చేసిన తప్పుడు పనిని సీఎం జగన్‌రెడ్డి సమర్థిస్తున్నారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్‌మీరా ధ్వజమెత్తారు.  శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియోను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపి నిజానిజాలు నిగ్గుతేల్చాలి. తెదేపా వాళ్లు సామాజిక మాధ్యమాల్లో చిన్న వీడియో పెట్టినా వెతికి పట్టుకునే పోలీసులు.. ఎంపీ ఒరిజినల్‌ వీడియోను గుర్తించలేరా? నిందితుడ్ని రక్షించడానికే అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ప్రెస్‌మీట్‌ పెట్టారు. చేసిన తప్పునకు పశ్చాత్తాప పడాల్సింది పోయి.. తెదేపా అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌, కొన్ని మీడియా సంస్థల యజమానులను నోటికొచ్చినట్లు మాట్లాడటం మాధవ్‌కు తగదు...’’ అని నాగుల్‌మీరా పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని