దేశానికి దిశానిర్దేశం చేసిన బిహార్‌ : తేజస్వి

‘ప్రజాస్వామ్యం పురుడు పోసుకున్న నేల బిహార్‌.. నేడు మళ్లీ దేశానికి దిశానిర్దేశం చేసింది’ అని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్‌ ట్విటర్‌ వేదికగా వ్యాఖ్యానించారు. కుటుంబసభ్యులతో కలిసి రక్షాబంధన్‌

Published : 13 Aug 2022 05:44 IST

సోనియాగాంధీ, వామపక్ష నేతలతో భేటీ

దిల్లీ, బలియా (యూపీ): ‘ప్రజాస్వామ్యం పురుడు పోసుకున్న నేల బిహార్‌.. నేడు మళ్లీ దేశానికి దిశానిర్దేశం చేసింది’ అని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్‌ ట్విటర్‌ వేదికగా వ్యాఖ్యానించారు. కుటుంబసభ్యులతో కలిసి రక్షాబంధన్‌ వేడుకలు జరుపుకొనేందుకు దిల్లీకి వచ్చిన ఆయన కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజాలతో విడివిడిగా భేటీ అయ్యారు. బిహార్‌తోపాటు దేశ రాజకీయ పరిస్థితులపై వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.  వచ్చే సాధారణ ఎన్నికల్లో బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ను ప్రతిపక్షాలు తమ ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే మద్దతిస్తామని సుహేల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ అధ్యక్షుడు ఓంప్రకాశ్‌ రాజ్‌భర్‌ శుక్రవారం ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని