2024 ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తాం.. ఎమ్మెల్యే నల్లపురెడ్డిని నిలదీసిన వైకాపా కార్యకర్తలు

‘గ్రామంలో నాకు డబ్బులు రావాల్సి ఉంటే.. మన పార్టీకి చెందిన నాయకులే రాకుండా అడ్డుకుంటున్నారు. కార్యకర్తలకేం చేశారు. గ్రామంలో ఏమైనా

Updated : 14 Aug 2022 08:37 IST

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు, ఇందుకూరుపేట, న్యూస్‌టుడే: ‘గ్రామంలో నాకు డబ్బులు రావాల్సి ఉంటే.. మన పార్టీకి చెందిన నాయకులే రాకుండా అడ్డుకుంటున్నారు. కార్యకర్తలకేం చేశారు. గ్రామంలో ఏమైనా అభివృద్ధి చేశారా?’ అంటూ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని వైకాపా కార్యకర్త షేక్‌ రఫీ నిలదీశారు. ఆ సమయంలో రఫీ పక్కన నాలుగో వార్డు సభ్యుడు గణేష్‌ ఉన్నారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శనివారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొరుటూరులో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి కొన్నిచోట్ల నిరసనలు ఎదుర్కొన్నారు. 2024 ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తామని సవాళ్లు విసిరారు. ‘గేదెలు చనిపోతే పరిహారం రాలేదు. పశు వైద్యులు అందుబాటులో ఉండటం లేదు’ అని గ్రామ ఉప సర్పంచి తుమ్మల ప్రసాద్‌ చిన్నాన్న శీనయ్య ఎమ్మెల్యేను నిలదీశారు. దీనిపై స్పందించిన ఉప సర్పంచి ప్రసాద్‌.. ‘‘ఎమ్మెల్యేనే ప్రశ్నిస్తావా?’’ అంటూ తన చిన్నాన్నను కొట్టుకుంటూ తీసుకెళ్లడం గమనార్హం. వెన్ను వైష్ణవి ఇంటికి వెళ్లగా జగనన్న విద్యాదీవెన అందలేదని తెలపగా.. తన జేబులో నుంచి రూ.10 వేలు తీసి అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని