మాధవ్‌ వీడియో అసలైందే..

వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఒక మహిళతో నగ్నంగా వీడియోకాల్‌ మాట్లాడుతున్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న వీడియో అసలైనదేనని అమెరికాలో పేరుగాంచిన

Updated : 14 Aug 2022 12:48 IST

అమెరికా ఎక్లిప్స్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ధ్రువీకరించింది

తెదేపా నేతలు పట్టాభిరామ్‌, అనిత వెల్లడి

ఈనాడు, అమరావతి: వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఒక మహిళతో నగ్నంగా వీడియోకాల్‌ మాట్లాడుతున్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న వీడియో అసలైనదేనని అమెరికాలో పేరుగాంచిన ఫోరెన్సిక్‌ నిపుణుడు జిమ్‌ స్టాఫోర్డ్‌ ధ్రువీకరించినట్టు తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ పేర్కొన్నారు. వీడియోను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపకుండా.. దాన్ని మార్ఫింగ్‌, ఎడిట్‌ చేసిన వీడియోగా తేల్చేసి ఎంపీ మాధవ్‌ను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా ప్రయత్నిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు తామే ఆ వీడియోను అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న ఎక్లిప్స్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో పరీక్షకు పంపించామని పట్టాభి తెలిపారు. తనకు సోదరుడయ్యే పోతిని ప్రసాద్‌ ఆ పరీక్ష చేయించారన్నారు. తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనితతో కలసి పట్టాభి శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ‘ఎంపీ మాధవ్‌ డర్టీ పిక్చర్‌ వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్న సీఎం జగన్‌రెడ్డికి సమాధానం చెప్పేలా మేం ఫోరెన్సిక్‌ పరీక్ష చేయించి తెప్పించిన నివేదిక ఇది. జగన్‌రెడ్డీ.. మాధవ్‌పై చర్య తీసుకోవడానికి ఈ నివేదిక సరిపోతుందా లేదా ఇంకా నాటకాలాడతారా’ అని పట్టాభి ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని