సహ చట్టాన్ని తుంగలో తొక్కేలా ప్రభుత్వం తీరు

సమాచార హక్కు చట్టాన్ని తుంగలో తొక్కేలా రాష్ట్ర ప్రభుత్వ శాఖలు వ్యవహరిస్తున్నాయని తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ మండిపడ్డారు. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా

Published : 14 Aug 2022 05:18 IST

సీఎస్‌కు ఎమ్మెల్యే పయ్యావుల లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సమాచార హక్కు చట్టాన్ని తుంగలో తొక్కేలా రాష్ట్ర ప్రభుత్వ శాఖలు వ్యవహరిస్తున్నాయని తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ మండిపడ్డారు. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పరిస్థితిలో మార్పురావడం లేదని విమర్శించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి శనివారం ఆయన లేఖ రాశారు. ‘ఆర్‌టీఐ చట్టం ప్రకారం ప్రతి ప్రభుత్వ విభాగం.. తమకు సంబంధించిన సమాచారాన్ని అధికారిక వెబ్‌సైట్లలో ఉంచాలి. తద్వారా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు ప్రజలకు తెలుస్తాయి. కానీ చాలా శాఖలు.. ఈ సమాచారాన్ని జనబాహుళ్యంలో ఉంచడం లేదు. ఈ విషయంలో హైకోర్టు ఆదేశాలనూ ప్రభుత్వం అమలు చేయడం లేదు. ఇకపై ప్రభుత్వ వెబ్‌సైట్‌లలో తాజా సమాచారం ఉండేలా చూడండి. సహచట్టాన్ని సమర్థంగా అమలు చేయండి’ అని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని