బిహార్‌లో కాంగ్రెస్‌కు మంత్రి పదవులు ఖరారు

బిహార్‌లో కాంగ్రెస్‌కు మంత్రి పదవుల సంఖ్యపై నిర్ణయం జరిగిందని.. ఈ నెల 16న నూతన మంత్రి వర్గం ప్రమాణం స్వీకారం చేసే అవకాశం ఉందని ఆ రాష్ట్ర వ్యవహారాల ఏఐసీసీ ఇన్‌ఛార్జి భక్త చరణ్‌ దాస్‌ వెల్లడించారు. మహాగఠ్‌బంధన్‌ ప్రభుత్వంలో కాంగ్రెస్‌కు ఎన్ని మంత్రి పదవులు లభిస్తాయనేది కూటమి భాగస్వాములతో చర్చల

Published : 14 Aug 2022 05:38 IST

దిల్లీ: బిహార్‌లో కాంగ్రెస్‌కు మంత్రి పదవుల సంఖ్యపై నిర్ణయం జరిగిందని.. ఈ నెల 16న నూతన మంత్రి వర్గం ప్రమాణం స్వీకారం చేసే అవకాశం ఉందని ఆ రాష్ట్ర వ్యవహారాల ఏఐసీసీ ఇన్‌ఛార్జి భక్త చరణ్‌ దాస్‌ వెల్లడించారు. మహాగఠ్‌బంధన్‌ ప్రభుత్వంలో కాంగ్రెస్‌కు ఎన్ని మంత్రి పదవులు లభిస్తాయనేది కూటమి భాగస్వాములతో చర్చల తర్వాత నిర్ణయం తీసుకున్నారన్న ఆయన ఎన్ని మంత్రి పదవులు ఇస్తున్నారనే దానిపై మాత్రం స్పష్టతనివ్వలేదు. ‘‘మేము ఇంకా పేర్లను ఖరారు చేయలేదు. సభలో మా బలం ప్రకారం మంత్రి పదవులు లభిస్తాయి’’ అని దాస్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని