అప్పుల తెలంగాణగా మార్చింది కేసీఆరే: షర్మిల

మిగులు బడ్జెట్‌లో ఉన్న బంగారు తెలంగాణను ఈ ఎనిమిదేళ్లలో అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా ఆమె శనివారం వికారాబాద్‌

Published : 14 Aug 2022 06:06 IST

దౌల్తాబాద్‌, మద్దూరు, న్యూస్‌టుడే: మిగులు బడ్జెట్‌లో ఉన్న బంగారు తెలంగాణను ఈ ఎనిమిదేళ్లలో అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా ఆమె శనివారం వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలంలో రెండో రోజు పాదయాత్ర నిర్వహించారు. ఉదయం దౌల్తాబాద్‌ నుంచి దేవర్‌పస్లావాద్‌ వరకు యాత్ర కొనసాగిస్తూ ప్రజలతో మాట్లాడారు. అనంతరం షర్మిల పాదయాత్ర నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోకి ప్రవేశించింది. దామగాన్‌పూర్‌, నాగిరెడ్డిపల్లి, నాగంపల్లి మీదుగా రాత్రికి మద్దూరు శివారుకు చేరుకొని అక్కడే శిబిరంలో బస చేశారు. మార్గమధ్యలో దామగాన్‌పూర్‌ వద్ద పొలాల్లో పనులు చేస్తున్న రైతులు, కూలీలతో మాట్లాడి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుబంధు పేరుతో ఎకరాకు రూ.5వేలు ఇచ్చి, రూ.30వేల రాయితీ లభించే పథకాలను రద్దుచేశారని షర్మిల ధ్వజమెత్తారు. కేసీఆర్‌ పాలనలో 8వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు ఆమె పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను ఆదరిస్తే వైఎస్సార్‌ సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తానని హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని