‘మునుగోడు నిన్ను క్షమించదు’

‘మునుగోడు నిన్ను క్షమించదు’ అంటూ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చిత్రంతో మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్‌, సంస్థాన్‌ నారాయణపురం మండలాల్లో పెద్ద సంఖ్యలో గోడపత్రికలు వెలిశాయి. శనివారం తెల్లవారేసరికి

Updated : 14 Aug 2022 06:38 IST

రాజగోపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా వెలిసిన గోడపత్రికలు

చౌటుప్పల్‌, సంస్థాన్‌నారాయణపురం, న్యూస్‌టుడే: ‘మునుగోడు నిన్ను క్షమించదు’ అంటూ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చిత్రంతో మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్‌, సంస్థాన్‌ నారాయణపురం మండలాల్లో పెద్ద సంఖ్యలో గోడపత్రికలు వెలిశాయి. శనివారం తెల్లవారేసరికి ఇవి గోడలపై దర్శనమిచ్చాయి. ‘రూ.21 వేల కోట్ల కాంట్రాక్టు కోసం 13 ఏళ్ల నమ్మకాన్ని అమ్ముకున్నారని, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను ఈడీ వేధిస్తున్న రోజే అమిత్‌షాతో బేరమాడారని గోడ పత్రికల్లో ఆరోపించారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ‘ఆజాదీ గౌరవ్‌ యాత్ర’ చేపట్టిన రోజే కనిపించిన ఈ గోడపత్రికలు సంచలనం రేకెత్తించాయి. దీనిపై రాజగోపాల్‌రెడ్డి అభిమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.   


రాజకీయంగా ఎదుర్కోలేకే ఆరోపణలు: రాజగోపాల్‌రెడ్డి

చండూరు, మునుగోడు న్యూస్‌టుడే: తనను రాజకీయంగా ఎదుర్కోలేక.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చౌటుప్పల్‌, సంస్థాన్‌ నారాయణపురం మండలాల్లో అసత్య ఆరోపణలతో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు గోడ పత్రికలు అతికించారని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా చండూరులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అమ్ముడుపోయే వ్యక్తినైతే 12 మంది ఎమ్మెల్యేలతోపాటే వెళ్లే వాడినని చెప్పారు. తన త్యాగం వెనుక తెలంగాణ భవిష్యత్తు దాగి ఉందన్నారు. సోనియాగాంధీ అంటే తనకు గౌరవం ఉందని, కానీ రాష్ట్రంలో కుటుంబ పాలనను అంతం చేయాలంటే కేంద్రంలో ఉన్న భాజపాతోనే సాధ్యమవుతుందనే ఆలోచనతోనే పదవికి రాజీనామా చేసినట్లు గుర్తు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని