వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా: తమ్మినేని వీరభద్రం

కాషాయ రాజకీయాలు దేశానికి, ప్రజలకు ముప్పుగా మారాయని.. దీనికి అడ్డుకట్ట వేసేందుకు భాజపాను ఓడించాలని మునుగోడు నియోజకవర్గ ప్రజలకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

Published : 14 Aug 2022 06:06 IST

చౌటుప్పల్‌, న్యూస్‌టుడే: కాషాయ రాజకీయాలు దేశానికి, ప్రజలకు ముప్పుగా మారాయని.. దీనికి అడ్డుకట్ట వేసేందుకు భాజపాను ఓడించాలని మునుగోడు నియోజకవర్గ ప్రజలకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో శనివారం నిర్వహించిన పార్టీ నియోజకవర్గ విస్తృత సమావేశంలో, అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. సీపీఐ, సీపీఎం, ఇతర వామపక్షాలు కలిసి సరైన రాజకీయ నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతామని స్పష్టంచేశారు. భాజపాను ఎలా ఓడిస్తామో త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా చేశానని రాజగోపాల్‌రెడ్డి చెప్పడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వం నిధులివ్వడం లేదని భాజపాలో చేరితే నిధులిస్తారా అని ప్రశ్నించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం, భాజపా రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన రాజీనామా చేశారని ఆరోపించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts