‘కాళేశ్వరం’లో అవినీతిపై విచారణ జరిపించాలి

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని, ఈ అవినీతి వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ జన సమితి (తెజస) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం డిమాండ్‌ చేశారు.

Published : 14 Aug 2022 06:06 IST

తెజస అధ్యక్షుడు ప్రొ.కోదండరాం

అబిడ్స్‌, న్యూస్‌టుడే: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని, ఈ అవినీతి వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ జన సమితి (తెజస) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం డిమాండ్‌ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని తెజస కార్యాలయంలో చేపట్టిన రణదీక్షలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టు కింద రైతులు మూడుసార్లు వేసిన పంటలు మునిగి తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు డిజైన్‌ మార్చి నిర్మించడమే దీనికి కారణమని ఆరోపించారు. ‘‘రైతులకు జరిగిన నష్టానికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం పంట నష్టాన్ని కూడా అంచనా వేయకపోవడం దురదృష్టకరం. ప్రాజెక్టు నిర్మాణంలోని లొసుగులపై విచారణ చేపట్టి సత్వరమే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. రైతులకు న్యాయం చేయని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉద్ధృతం చేస్తాం’’ అని ప్రొ.కోదండరాం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెజస రాష్ట్ర ఉపాధ్యక్షులు విశ్వేశ్వర్‌రావు, గంగాపురం వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శులు శంకర్‌రావు, ధర్మజున్‌, రమేశ్‌ ముదిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని