అధికారంలోకి వచ్చేందుకు కొందరు ఏదైనా చేస్తారు

దక్షిణ తెలంగాణలోని కొందరు నాయకులు అధికారంలోకి రావడానికి ఏదైనా చేస్తారని, ఎంతకైనా తెగిస్తారని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ విమర్శించారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్దార్‌ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు ఆదివారం రవీంద్రభారతిలో

Published : 15 Aug 2022 05:39 IST

 సర్దార్‌ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

రవీంద్రభార[తి, న్యూస్‌టుడే: దక్షిణ తెలంగాణలోని కొందరు నాయకులు అధికారంలోకి రావడానికి ఏదైనా చేస్తారని, ఎంతకైనా తెగిస్తారని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ విమర్శించారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్దార్‌ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు ఆదివారం రవీంద్రభారతిలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. ‘‘సాధారణంగా ఏదైనా సంఘటన జరిగితే ఎవరైనా విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తారు. కొందరు నేతలు మాత్రం మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ డిమాండ్‌ చేశారంటే బీసీ నాయకుడి ఎదుగుదలను చూసి ఓర్వలేనితనం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధాని మోదీ కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. చట్టసభల్లో బీసీలు, మహిళలకు రిజర్వేషన్ల కల్పన వంటి అంశాలను పరిష్కరించాలి. లేదంటే చట్ట సవరణ చేసి రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వాలి. రాష్ట్రాలకు ఏం కావాలో ఆలోచించాలి. సర్వాయి పాపన్న పేరిట ట్రస్ట్‌ ఏర్పాటు చేశాం. ఆత్మగౌరవ భవనానికి ఆయన పేరు పెడతాం’’ అని పేర్కొన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. బీసీల ఆత్మగౌరవానికి శ్రీనివాసగౌడ్‌ ప్రతీక అన్నారు. సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌, బీసీ కమిషన్‌ సభ్యులు కిషోర్‌గౌడ్‌, బీసీ కుల సంఘాల ఐకాస ఛైర్మన్‌ కుందారపు గణేష్‌చారి, బీసీ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.దుర్గయ్యగౌడ్‌, గ్రంథాలయ ఛైర్మన్‌ మురళి, తెలుగు భాషా చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు బడేసాబ్‌, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కులకచర్ల శ్రీనివాస్‌, యువజన సంఘం అధ్యక్షుడు కనకాల శ్యామ్‌, జాతీయ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు తాటికొండ విక్రమ్‌గౌడ్‌, మహిళా కార్యనిర్వాహక అధ్యక్షురాలు మణిమంజరి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని