బీసీలకు గుర్తింపు ఇచ్చింది కేసీఆరే: గంగుల

తెలంగాణలో బీసీలకు గుర్తింపు ఇచ్చి, వారి ఆత్మగౌరవాన్ని పెంచింది ముఖ్యమంత్రి కేసీఆరేనని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. ఆదివారం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఉప్పల్‌

Published : 15 Aug 2022 05:39 IST

ఉప్పల్‌, న్యూస్‌టుడే: తెలంగాణలో బీసీలకు గుర్తింపు ఇచ్చి, వారి ఆత్మగౌరవాన్ని పెంచింది ముఖ్యమంత్రి కేసీఆరేనని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. ఆదివారం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఉప్పల్‌ భగాయత్‌లో ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ డా.వకుళాభరణం కృష్ణమోహన్‌రావుతో కలిసి సోమవంశ సహస్రార్జున క్షత్రియ ఆత్మగౌరవ భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యంతో వెనకబడిన బీసీలకు కేసీఆర్‌ ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. ‘‘సీఎం కేసీఆర్‌ 41 కులసంఘాలకు రాష్ట్ర నడిబొడ్డున 82.3 ఎకరాల భూములు కేటాయించి రూ.95.2 కోట్లతో ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నారు. సోమవంశ సహస్రార్జున క్షత్రియ భవనానికీ 30 గుంటల స్థలం, రూ.75 లక్షల నిధులు కేటాయించారు’’ అని మంత్రి వివరించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు కొదవలేదని బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ డా.వకుళాభరణం కృష్ణమోహన్‌రావు పేర్కొన్నారు. కార్యక్రమంలో సోమవంశ సహస్రార్జున క్షత్రియ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డా.విశ్వనాథ్‌ రవీందర్‌, మాజీ ఎమ్మెల్యేలు శికారి విశ్వనాథం, కె.అశోక్‌, ప్రతినిధులు కె.శ్రీనివాస్‌, రాంచందర్‌, విశ్వనాథ్‌ బాలకిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని