Mahendar Reddy: టికెట్‌ ఎవరికి వచ్చినా పనిచేస్తా: ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి

2023లో జరగబోయే శాసన సభ ఎన్నికల్లో తాండూరు నుంచి తెరాస టికెట్‌ ఎవరికి వచ్చినా వారి గెలుపు కోసం పనిచేస్తానని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి తెలిపారు. వికారాబాద్‌ జిల్లా తాండూరులోని తన స్వగృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన

Updated : 15 Aug 2022 07:33 IST

తాండూరు, న్యూస్‌టుడే: 2023లో జరగబోయే శాసన సభ ఎన్నికల్లో తాండూరు నుంచి తెరాస టికెట్‌ ఎవరికి వచ్చినా వారి గెలుపు కోసం పనిచేస్తానని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి తెలిపారు. వికారాబాద్‌ జిల్లా తాండూరులోని తన స్వగృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టికెట్‌ మాత్రం తనకే వస్తుందని గట్టిగా నమ్ముతున్నట్లు చెప్పారు. అధిష్ఠానం తాండూరు రాజకీయాలపై తనకు కొన్ని విషయాల గురించి స్పష్టత ఇచ్చిందని అవి మా మధ్యనే ఉంటాయన్నారు.

నేనేం చేయలేను

తాండూరు, వికారాబాద్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్లను మార్చే విషయంలో తాము జోక్యం చేసుకోలేమని, స్థానికంగా మీరే మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలని అధిష్ఠానం సూచించిందని వివరించారు. ఛైర్‌పర్సన్లను రాజీనామా చేయాలని సూచిస్తే ససేమిరా అంటున్నారు. కాబట్టి నేనేమీ చేయలేను. మున్సిపాలిటీ పాలనా వ్యవహారాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జోక్యం ఉండదు. పాలక వర్గాలు ఆహ్వానిస్తే మాత్రమే వెళ్లాలనే నిబంధన ఉందని పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లో ఛైర్మన్ల నిర్ణయమే అంతిమంగా ఉంటుందన్నారు. జిల్లాలో రాజకీయంగా ఏం జరుగుతోందో తనకు బాగా తెలుసని అన్నారు.

సభకు లక్షమంది సమీకరణ

ఈ నెల 16న జరిగే సీఎం కేసీఆర్‌ బహిరంగ సభకు జిల్లానుంచి లక్ష మందిని సమీకరిస్తున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని