Jagadeesh Reddy: కేసీఆర్‌ను భయపెట్టేవారు ఇంకా పుట్టలేదు: మంత్రి జగదీశ్‌రెడ్డి

దేశ రాజకీయాల్లో ఎవరినైనా నిలదీయగల శక్తి సీఎం కేసీఆర్‌కే ఉందని.. ఆయన్ను భయపెట్టేవారు ఇంకా పుట్టలేదని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. నల్గొండలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలోనూ, మర్రిగూడలో తెరాస కార్యకర్తల విస్తృతస్థాయి

Updated : 15 Aug 2022 08:52 IST

నీలగిరి, మర్రిగూడ, న్యూస్‌టుడే: దేశ రాజకీయాల్లో ఎవరినైనా నిలదీయగల శక్తి సీఎం కేసీఆర్‌కే ఉందని.. ఆయన్ను భయపెట్టేవారు ఇంకా పుట్టలేదని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. నల్గొండలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలోనూ, మర్రిగూడలో తెరాస కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలోనూ మాట్లాడారు. ఈడీ బోడీల పేరు చెబితే తెరాస నాయకులు భయపడరని స్పష్టంచేశారు. చట్టబద్ధ సంస్థలను భాజపా నేతలు జేబు సంస్థలుగా చేసుకుని రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.

బండి సంజయ్‌ గల్లీ లీడర్‌ అని.. ఆయన వీధి రౌడీని తలపించేలా మాట్లాడుతున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. మోదీ ఇచ్చిన రూ.22 వేల కోట్ల కాంట్రాక్టుకు రాజగోపాల్‌రెడ్డి అమ్ముడుపోయారని ఆరోపించారు. తన కుటుంబ అభివృద్ధి కోసం పార్టీని వీడిన ఆయన.. తెరాసది కుటుంబ పాలన అంటూ విమర్శించడం దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు.

మునుగోడులో తెరాస విజయం ఖాయమని, భాజపాకు దక్కేది మూడో స్థానమేనని ధీమా వ్యక్తంచేశారు. ఈ ఎన్నికలే కోమటిరెడ్డి సోదరులకు చివరివని జోస్యం చెప్పారు. భాజపా వ్యతిరేక శక్తులతో పనిచేయడానికి వామపక్షాలు కలిసిరావాలని కోరారు. ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి(నల్గొండ), పైళ్ల శేఖర్‌రెడ్డి(భువనగిరి), ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని