గంజాయి కేసులను నర్సీపట్నంలోనే విచారించాలి

గంజాయి కేసులను నర్సీపట్నం న్యాయస్థానంలోనే విచారించేలా న్యాయశాఖ ఉత్తర్వులు ఇవ్వాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు కోరారు.

Published : 15 Aug 2022 06:03 IST

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: గంజాయి కేసులను నర్సీపట్నం న్యాయస్థానంలోనే విచారించేలా న్యాయశాఖ ఉత్తర్వులు ఇవ్వాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు కోరారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆదివారం ఆయన ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు. ‘ఏళ్లతరబడి గంజాయి కేసులు పరిష్కారం కాకపోవడంతో న్యాయశాఖ గత నెల 16న చోడవరం, అనకాపల్లి, గాజువాక న్యాయస్థానాల్లో విచారించేలా ఉత్తర్వులు ఇచ్చింది. గంజాయి కేసులు నర్సీపట్నం ప్రాంతంలోనే ఎక్కువగా ఉన్నాయి’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని