ఉపాధి కల్పనలో సీఎం విఫలం: షర్మిల

రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లోనూ, యువతకు ఉపాధి చూపడంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విఫలమయ్యారని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ఆమె చేపట్టిన పాదయాత్ర నారాయణపేట జిల్లాలో కొనసాగింది. ముందురోజు

Published : 16 Aug 2022 05:54 IST

నారాయణపేట, దామరగిద్ద, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లోనూ, యువతకు ఉపాధి చూపడంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విఫలమయ్యారని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ఆమె చేపట్టిన పాదయాత్ర నారాయణపేట జిల్లాలో కొనసాగింది. ముందురోజు దామరగిద్ద మండల కేంద్రం శివారులో బస చేసిన ఆమె.. సోమవారం ఉదయం శిబిరం వద్దే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. 10గంటల సమయంలో పాదయాత్ర మొదలయింది. మద్దెలబీడ్‌ స్టేజి వద్ద ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మధ్యాహ్నానికి నారాయణపేట శివారుకు చేరుకొన్నారు. అక్కడ శిబిరం వద్ద భోజనాల అనంతరం పట్టణంలోని సత్యనారాయణ కూడలిలో రోడ్డు షో నిర్వహించి మాట్లాడారు. పేట మండలం అప్పక్‌పల్లిలో రాత్రి  బస చేశారు.

ఉద్యమకారుడికి ఆర్థిక సాయం..

తెలంగాణ ఉద్యమంలో 2011లో రైల్‌రోకో సందర్భంగా కాళ్లు, చేతులు పోగొట్టుకొని దివ్యాంగుడిగా మారిన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌(రాయనగూడెం) వాసి నాగరాజును షర్మిల నారాయణపేటకు రప్పించారు. ఇటీవల ప్రగతిభవన్‌ వద్ద ఆయన ఆత్మహత్యాయత్నం చేశారని తెలుసుకుని.. తనవంతుగా ఆమె రూ.4 లక్షల చెక్కును అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని