పార్టీ ఫిరాయింపుల ప్రయోగశాలగా తెలంగాణ

తెలంగాణను పార్టీ ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చి సీఎం కేసీఆర్‌ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. సర్పంచులను, ఎంపీటీసీ సభ్యులను కొనుగోలు చేయడం ద్వారా మునుగోడులో

Published : 16 Aug 2022 05:54 IST

సీఎం కేసీఆర్‌పై రేవంత్‌ విమర్శ

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: తెలంగాణను పార్టీ ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చి సీఎం కేసీఆర్‌ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. సర్పంచులను, ఎంపీటీసీ సభ్యులను కొనుగోలు చేయడం ద్వారా మునుగోడులో గెలవాలని దుర్మార్గ రాజకీయాలకు ఒడిగడుతున్నారని మండిపడ్డారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి రోజైన ఆగస్టు 20 నుంచి తాను మునుగోడు ప్రజల మధ్యే ఉంటానని రేవంత్‌ పేర్కొన్నారు. హోం క్వారంటైన్‌లో ఉంటున్న ఆయన జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

‘మునుగోడు’ ఇన్‌ఛార్జుల నియామకం

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గంలోని మండలాలకు ఇన్‌ఛార్జులను నియమించింది. చౌటుప్పల్‌ మండలానికి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డిలను, నారాయణపూర్‌ మండలానికి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌, గండ్ర సత్యనారాయణలను, మనుగోడుకు ఎమ్మెల్యే సీతక్క, విజయ రమణారావులను, నాంపల్లికి అంజన్‌కుమార్‌ యాదవ్‌, డా.మల్లు రవిలను, గట్టుప్పల్‌కు ఎస్‌.ఎ.సంపత్‌కుమార్‌, ఆది శ్రీనివాస్‌లను, చండూరుకు ఈరవర్తి అనిల్‌, డా.వంశీకృష్ణలను, మర్రిగూడ మండలానికి చెరుకు సుధాకర్‌, వేంనరేందర్‌రెడ్డిలను ఇన్‌ఛార్జులుగా నియమించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని