మంత్రి జగదీశ్‌రెడ్డి ఆస్తుల చిట్టా బయటపెడతా: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

మంత్రి జగదీశ్‌రెడ్డి నేరచరిత్రను, బినామీల పేరుతో ఆయన సంపాదించిన కోట్ల రూపాయల ఆస్తుల చిట్టాను బయటపెడతానని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. మంత్రి ఒక హత్య కేసులో

Updated : 16 Aug 2022 08:31 IST

చౌటుప్పల్‌, న్యూస్‌టుడే: మంత్రి జగదీశ్‌రెడ్డి నేరచరిత్రను, బినామీల పేరుతో ఆయన సంపాదించిన కోట్ల రూపాయల ఆస్తుల చిట్టాను బయటపెడతానని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. మంత్రి ఒక హత్య కేసులో జైలుకు వెళ్లివచ్చిన నిందితుడని ఆరోపించారు. ఆ విషయాన్ని తెలిపే రుజువులు తనవద్ద ఉన్నాయని తెలిపారు. తెరాస ప్రభుత్వం రాకముందు మంత్రికి ఉన్న ఆస్తులెన్ని? ఇప్పుడున్నవెన్ని? అని ప్రశ్నించారు.ఆయన శంషాబాద్‌ ప్రాంతంలో ఫాంహౌస్‌ నిర్మించుకున్నారని, అక్కడికి మీడియాతో కలిసి వస్తానని సవాల్‌ చేశారు. రాజగోపాల్‌రెడ్డి సోమవారం చౌటుప్పల్‌లో అనుచరులతో నిర్వహించిన సమావేశంలో, అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకే మంత్రి జగదీశ్‌రెడ్డి తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారన్నారు. 2009 తర్వాత తాను ఆస్తులను అమ్ముకున్నానని చెప్పారు. తాను కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయానని, తప్పుడు పనులు చేశానని ఆరోపిస్తున్న మంత్రి అందుకు ఆధారాలుంటే బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. తనపై ఆరోపణలు నిరూపిస్తే మునుగోడు ఎన్నికల్లో పోటీ చేయనని, రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్పష్టం చేశారు. మంత్రి అక్రమ ఆస్తులు, నేర చరిత్రను రుజువు చేస్తానని, అప్పుడు ఆయన తన పదవికి రాజీనామా చేయాలని సవాల్‌ విసిరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని