జగన్‌ పాలనలో.. తెలంగాణకు వలసపోయే పరిస్థితి వచ్చింది

దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ ఆంధ్రప్రదేశ్‌లో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. సీఆర్‌డీఏ వేలంలో కేవలం మూడు ప్లాట్లకు మాత్రమే బిడ్లు వచ్చాయంటే.. రాష్ట్రంలో పరిస్థితి

Published : 16 Aug 2022 06:07 IST

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ ఆంధ్రప్రదేశ్‌లో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. సీఆర్‌డీఏ వేలంలో కేవలం మూడు ప్లాట్లకు మాత్రమే బిడ్లు వచ్చాయంటే.. రాష్ట్రంలో పరిస్థితి అర్థమవుతుందన్నారు. దిల్లీలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఆర్‌డీఏ వ్యాపార ప్రకటన పరిశీలిస్తే రాష్ట్ర ముఖచిత్రం స్పష్టమవుతుందన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో ప్రజలు తెలంగాణకు వలస పోయేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నీ అబద్ధాలే చెప్పారని ఆయన విమర్శించారు. నగ్న వీడియో ఎంపీ మాధవ్‌దేనని ప్రతిష్టాత్మక పరిశోధన సంస్థ తేల్చి చెప్పిన తర్వాత కూడా ఈ సన్మానాలు ఏమిటని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని