స్వాతంత్య్ర సాధనలో కమ్యూనిస్టులది కీలకపాత్ర

స్వాతంత్య్ర పోరాటంలో కమ్యూనిస్టులు కీలక భూమిక పోషించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పష్టంచేశారు. సోమవారం విజయవాడ దాసరి భవన్‌ ఆవరణలో ఆయన జాతీయ పతాకాన్ని

Updated : 16 Aug 2022 06:40 IST

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

విజయవాడ (అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే: స్వాతంత్య్ర పోరాటంలో కమ్యూనిస్టులు కీలక భూమిక పోషించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పష్టంచేశారు. సోమవారం విజయవాడ దాసరి భవన్‌ ఆవరణలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తమ పార్టీ శ్రేణులతో కలిసి 75 అడుగుల త్రివర్ణ పతాకంతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ... దేశభక్తి గురించి సావర్కర్‌ వారసులైన భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ వారు చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులు రాంపిళ్ల నరసాయమ్మ, పలువురు స్వాతంత్య్ర సమరయోధుల వారసులను సన్మానించారు. సన్మానం అందుకున్న వారిలో సరస్వతి గోరా మనవడు చెన్నుపాటి వజీర్‌, జోస్యభట్ల సత్యనారాయణ-సుబ్బమ్మ దంపతుల మనువరాలు జోస్యభట్ల స్వాతి, ఎస్‌.ఆనందరావు కుమార్తె స్వర్ణ, స్వాతంత్య్ర సమరయోధుల వారసుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాంపిళ్ల జయప్రకాష్‌ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు అక్కినేని వనజ, జల్లి విల్సన్‌, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనేపూడి శంకర్‌, నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, ఏపీ మహిళా సమఖ్య కోశాధికారి పి.దుర్గాంబ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు